"గుడ్ న్యూస్" - తెలుగు.mp4
Telugu - "Good News".mp4 //యోహాను సువార్త అధ్యాయం 11 ఆదియందు
వాక్యముండెను, వాక్యము దేవునియొ...
46 Minuten
Podcast
Podcaster
INDIAN MOST POPULAR LANGUAGES BY NUMBER(FROM No.1 TO No.12) / ===“Good News for All People”, "Words of Light", and "Songs og Life" // संख्या से सर्वाधिक बोली जाने वाली भाषाओं (१-१२) भारत में - ==="सभी लोगों के लिए अच्छी खबर", "प्रकाश के शब्द", और "जीव...
Beschreibung
vor 9 Jahren
Telugu - "Good News".mp4 //
యోహాను సువార్త అధ్యాయం 1
1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద
ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
2 ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన
మూలముగా కలిగెను,
3 కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
4 ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు
వెలుగైయుండెను.
5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి
దాని గ్రహింపకుండెను.
6 దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను;
అతని పేరు యోహాను.
7 అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ
వెలుగునుగూర్చి సాక్ష్య మిచ్చుటకు సాక్షిగా వచ్చెను.
8 అతడు ఆ వెలుగైయుండ లేదు గాని ఆ వెలుగునుగూర్చి
సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను.
9 నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు
ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.
10 ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను
గాని లోకమాయనను తెలిసికొనలేదు.
11 ఆయన తన స్వకీ యులయొద్దకు వచ్చెను; ఆయన
స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.
12 తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన
నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము
అనుగ్రహించెను.
13 వారు దేవునివలన పుట్టినవారే గాని,
రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు
కారు.
14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా
మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె
మనము ఆయన మహిమను కనుగొంటిమి
15 యోహాను ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచునా వెనుక
వచ్చువాడు నాకంటె ప్రముఖుడు గనుక ఆయన నాకంటె ముందటివాడాయెననియు,
నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను.
16 ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి
కృపను పొందితివిు.
17 ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను;
కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.
18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి
రొమ్ముననున్న అద్వితీయ కుమారుడె ఆయనను బయలు పరచెను.
Weitere Episoden
4 Minuten
vor 9 Jahren
5 Minuten
vor 9 Jahren
3 Minuten
vor 9 Jahren
59 Minuten
vor 9 Jahren
In Podcasts werben
Kommentare (0)